Breaking : సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది.

Update: 2024-03-22 05:28 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆమె పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ట్రయిల్ కోర్టుకు వెళ్లాలని...
అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈడీకి మాత్రం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. ఈ నెల 23వ తేదీన ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వులున్నాయి. ఈ నేపథ్యంలో కవిత పిటీషన్ తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News