BJP : బీజేపీలో కవితను చేర్చుకోం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు

Update: 2025-09-03 06:00 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, త్వరలోనే ఆ పార్టీలోని ఇతర నేతలు కూడా కారు దిగిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

దోచుకున్న సొమ్మును...
దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని, వారి కుటుంబ పంచాయితీ ఇప్పుడు రోడ్డున పడిందని ఆరోపించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో జరిగిన అవినీతి బట్టబయలైందని అన్నారు. సీబీఐ విచారణలో ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్నది తేలనుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News