BRS : రేవంత్ ను హరీశ్ ఎంత మాట అన్నారో తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ మాట మారస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ మాట మారస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చావును కోరుకుని, తర్వాత తాను అనలేదని చెప్పి తప్పించుకుంటే ప్రజలు క్షమించరని కూడా హరీశ్ రావు అన్నారు.
క్షమాపణలు చెప్పాలని...
కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, ఆయనను అనరాని మాటలు అంటే ప్రజలు కర్రుకారి వాత పెడతారని అన్నారు. గతంలో జానారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికిపాల్పడటం మానుకోవాలని హరీశ్ రావు రేవంత్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.