మంత్రి ఉత్తమ్ పై హరీశ్ రావు ఫైర్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్ రావు అన్నారు.అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న హరీశ్ రావు అవే అబద్ధాలతో ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. అన్నీ అబద్ధాలే చెబుతుందన్నారు.
సీతారామ ప్రాజెక్టుపై...
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ది దుష్ప్రచారమన్న మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాజెక్టుకు జలవనరుల సంఘం అనుమతులు ఉన్నాయని, బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేశామన్న హరీష్‌రావు దీనిపై కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తుందనిచెప్పారు. ఆ ప్రాంత ప్రజలకు అన్నివిషయాలుతెలుసునని కూడా హరీశ్ రావు అన్నారు.