నాన్నకు సూచనలతో: కవిత లేఖ

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు.

Update: 2025-05-23 13:02 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ సభ విజయవంతమైనందుకు తండ్రి కేసీఆర్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే సభలో బీజేపీపై కేసీఆర్ పరిమితంగా విమర్శలు చేయడం వల్ల, భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు ప్రజల్లోకి వెళ్లాయని కవిత విమర్శించారు.


ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలన్నారు తెలిపారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారని సమాచారం. వక్ఫ్ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తమైందని కవిత లేఖలో తెలిపారు.

Tags:    

Similar News