Big Breaking : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం... కారు నుంచి బయటకు గెంటివేత
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖల్యతో నిన్నటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నియమ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా, కవిత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. నేరుగా హరీశ్ రావు, సంతోష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించడం పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఇలాగే వదిలేస్తే...
కల్వకుంట్ల కవితను ఇలా వదిలేస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించిన పార్టీ అధిష్టానం, తన తండ్రిని ప్రశంసించినప్పటికీ, నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించడంతో కవితపై వేటు వేయడానికి నిన్నటి నుంచి సమాచాలోచనలను కేసీఆర్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైన సమావేశాలు తెల్లవారు జాము వరకూ కొనసాగాయి. మరొకసారి ఈరోజు ఉదయం కూడా కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు.
మీడియా సమావేశంలో...
అయితే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడకుండా కేవలం ప్రకటన ద్వారానే కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బయటకు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేసీఆర్ తో పాటు ముఖ్యనేతలు కూడా కవిత వ్యాఖ్యలు పార్టీతో పాటు తన కుటుంబ సభ్యులను అవమానపర్చేలా ఉన్నాయని భావించారు. అందుకే కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అయితే కల్వకుంట్ల కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.