Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు బంద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు బంద్ కొనసాగుతుంది.

Update: 2025-07-21 04:36 GMT

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు బంద్ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఆదివాసీలు బంద్ ను పాటిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బస్ డిపో వద్ద ఆందోళనకు దిగిన ఆదివాసీలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆదివాసీలు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి నేపథ్యంలో బంద్ ను పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

ఆదివాసీల పిలుపుతో...
జీవో నెంబరు 49ను రద్దు చేయాలని, పోడు భూములను గిరిజనులకు పంచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అటవీ శాఖ అధికారులు పోడు భూములకు వచ్చి మొక్కులను నాటే కార్యక్రమం చేపట్టడంతో పలు చోట్ల గిరిజనులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో బంద్క కు నేడు పిలుపు నిచ్చారు. బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News