ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం : బట్టతల బాధితుల సంఘం

బట్టతల బాధితులు ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డారు. తమకు నెలకు ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు

Update: 2023-01-06 07:55 GMT

బట్టతల బాధితులు ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డారు. తమకు నెలకు ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ బాధలను అర్ధం చేసుకుని నెలకు ఆరు వేల పింఛను చెల్లించాలని వారు కోరుతున్నారు. కోహెడ మండల బట్టతల బాధితుల సంఘం ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టతల బాధితులకు ఆరువేల రూపాయలు నెలకు పింఛనుగా ఇవ్వాలని కోరారు.

అసోసియేషన్ గా ఏర్పడి...

కోహెడ మండలంలోని తంగాళ్లపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో వీరు సమావేశమయ్యారు. మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బట్టతల బాధితుల సంఘంఅధ్యక్షుడిగా వెల్ది బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజేశం,కోశాధికారిగా మౌటం రాములు ఎన్నికయ్యారు. ఈ సంద్బంగా తాము సమాజంలో ఎదుర్కొంటున్న బాధలను, అవమానాలను గురించి చర్చించారు. సంక్రాంతి లోపు పింఛను అందించాలని, లేకపోతే పెద్దయెత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు.


Tags:    

Similar News