Azharuddin : జూబ్లీహిల్స్ టిక్కెట్ నాదే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది తానేనని చెప్పారు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది తానేనని చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు గెలిచినా కాంగ్రెస్ టిక్కెట్ తనకే దక్కుతుందని అజారుద్దీన్ తెలిపారు. ఉప ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని కూడా అజారుద్దీన్ అన్నారు. తనకు హైకమాండ్ అండదండలు ఉన్నాయని అజారుద్దీన్ తెలిపారు.
ఎన్ని ప్రచారాలు జరిగినా...
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, అయితే ప్రచారాలు చాలా జరుగుతాయని పోటీచేసేది మాత్రమే తానేనని అజారుద్దీన్ తెలిపారు. గత ఎన్నికల్లో సమయం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రచారం సరిగా చేయలేకపోయానన్న అజారుద్దీన్ ఈసారి మాత్రం గెలుపు తనదేనన్న ధీమాను వ్యక్తం చేశారు.