రిజల్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు విడుడల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2023-05-08 04:54 GMT

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు విడుడల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు...
అయితే విద్యాశాఖ మంత్రి అందుబాటులో ఉంటే రేపు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికదే ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణలోనూ రిజల్ట్ రిలీజ్ చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.


Tags:    

Similar News