Telangana : తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2025-12-01 12:52 GMT

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 8,9 లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కు భూమిని చదును చేస్తున్నారు. దాదాపు వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. అతిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. దేశ, విదేశాల నుంచి అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు ప్రముఖులు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్నారు. ప్రత్యేకంగా వేదికను ఫ్యూచర్ సిటీలో రూపొందిస్తున్నారు. సమ్మిట్ లో భాగంగా మూడు వేల డ్రోన్లతో షోను ఏర్పాటు చేస్తున్నారు.

వంద ఎకరాల్లో ఏర్పాట్లు...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వంద ఎకరాల్లో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. యాభై ఎకరాల్లో పార్కింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవేదికపై ప్రతినిధులు ప్రసంగించడానికి, మరొక వేదికను తెలంగాణ సాంస్కృతిక కళాకారులు విభిన్న ప్రదర్శనలు చేయనున్నారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు చర్చించుకోవడానికి ప్రత్యేక లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది.


Tags:    

Similar News