Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నికకు షెడ్యూల్
తెలంగాణలో మరో ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది.
telangana assembly today
తెలంగాణలో మరో ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది. ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన 12 స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నిక జరగనుంది.
కేకే రాజీనామాతో...
కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ జరగనుంది.ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 21 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. తెలంగాణ సహా హర్యానా, మధ్యప్రదేశ్..రాజస్థాన్, త్రిపురలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అసోం,బిహార్, మహారాష్ట్రలో రెండేసి స్థానాలకు ఎన్నిక జరగనుంది.