తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు

తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏడేళ్లలో 36,300 కోట్లను పెట్టుబడి పెట్టనుంది

Update: 2023-01-21 03:07 GMT

తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడేళ్లలో 36,300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించింది. అమెజాన్ వెబ్ సిరీస్ విస్తరణ, అదనపు పెట్టుబడి విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్ లో దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

36 వేల కోట్ల రూపాయలు....
భారీ పెట్టుబడులతో అమెజాన్ సంస్థ డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ విస్తరణ ప్రణాళికలు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దశలవారీగా 2030 నాటికి 36 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పడం హర్షించదగ్గ పరిణామమని తెలిపారు. వేల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, అమెజాన్ సంస్థ అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News