కాంగ్రెస్ సీనియర్ల సపరేట్ సమావేశం.. నేడు

ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలందరూ సమావేశం కానున్నారు

Update: 2022-03-20 01:49 GMT

కాంగ్రెస్ కు పార్టీకి శత్రువులు ఎవరో కాదు. ఆ పార్టీ నేతలే. ప్రజల్లో బలం లేని నేతలు కూడా తమ మాట నెగ్గాలని చూస్తుంటారు. పార్టీ పరిస్థితిని పక్కన పెట్టి తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతుంటారు. ప్రజల్లో పార్టీకి ఉన్న కాస్తో, కూస్తో ప్రతిష్టను మంటగలిలపే ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి ఆ పార్టీ నేతల వ్యవహార శైలి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అసంతృప్త నేతలు....
ఇప్పుడు పార్టీ కాస్త కుదురుకుంటున్న సమయంలో మరోసారి కాంగ్రెస్ అసంతృప్త నేతల సమావేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలందరూ సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వీరి సమావేశం జరగనుంది. తమకు పార్టీలో తగిన గౌరవం దొరకడం లేదంటూ వీరు ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసంతృప్త నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, గీతారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యే అవకాశముంది. ఢిల్లీ వెళ్లి హైకమాండ్ కు ఫిర్యాదు చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు


Tags:    

Similar News