రైతులకు తుమ్మల గుడ్ న్యూస్.. అందరికీ వర్తిస్తుందట
రైతుల రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు
Tummala nageswara rao
రైతుల రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు .
అర్హులైనవారందరికీ...
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో తుమ్మల నాగేశ్వరరావు సమీక్షలో పాల్గొని బయటకు వచ్చిన అనంతరం ఈ సందర్భంగా వామపక్ష నేతలు తుమ్మలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష నేతలతో మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తుందని ప్రకటించారు.