Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-01-18 04:12 GMT

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేదలను ఆదుకునేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తెలంగాణలో అత్యంత నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'కేరళ నమూనా'లో ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గ్రామాల్లో మహిళా సంఘాలు ఇంటింటికీ తిరిగి ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తాయి. ఈ పథకానికి సొంత ఇల్లు లేని వారు, కూలీలు, ఆదిమ తెగలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అర్హులు.

పదివేల కంటే...
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేదా ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నప్పటికీ నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ స్థిర ఆదాయం ఉన్నవారు దీనికి అనర్హులు. అలాగే సొంతంగా కారు, ట్రాక్టర్ వంటి వాహనాలు ఉన్నవారిని కూడా అనర్హులుగా గుర్తిస్తారు. ఈ పధకం కింద ఎంపికయిన వారికి ఆర్థిక సాయం అందించాలని భావిస్తుంది.


Tags:    

Similar News