దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్‌ లో జరగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం లో తెలంగాణ ముఖ్యమంత్రి ఫోరం ఎండీ జెరిమీ జర్గెన్స్ సమావేశవయ్యారు

Update: 2026-01-22 08:27 GMT

దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం లో తెలంగాణ ముఖ్యమంత్రి ఫోరం ఎండీ జెరిమీ జర్గెన్స్ సమావేశవయ్యారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం పాలో అప్ సదస్సు నిర్వహించాలని కోరరాు. అయితే ఇందుకు జెరిమీ జర్గెన్స్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఫాలో అప్ సదస్సును...
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఏటా దావోస్ లో జరుగుతున్నప్పటికీ అనేక అగ్రిమెంట్లు గ్రౌండ్ అవ్వడానికి ఇబ్బందికరంగా మారిందని, అయితే వాటిని తిరిగి లైన్ లో పెట్టేటందుకు హైదరాబాద్ లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి తెలంగాణలో మూడు ట్రిలిన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు.


Tags:    

Similar News