KTR : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలు చేయని వారిని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరితీయాలని కేటీఆర్ అన్నారు. రైతులను నిలువునా మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఉరితీయాలని అన్నారు. కేసీఆర్ ను ఉరితీయాలన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ కౌంటర్ ఇచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి బేసిన్లు, బేసిక్స్ కు తెలియవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ పార్లమెంటరీ భాష మాట్లాడుతుంటే స్పీకర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు
పేమెంట్ తో సీఎం అయి...
కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక భాషలో తిట్టడం వచ్చేమో.. తమకు మూడు నాలుగు భాషల్లో తిట్టడం వచ్చని తెలిపపారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక మాటంటే తాము నాలుగు మాటలంటామని, పేమెంట్ తో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి, ఉద్యమ సారధి కేసీఆర్ తో పోలికా అని కేటీఆర్ ప్రశ్నించారు. నదీ జలాలపై దశాబ్దాలుగా కాంగ్రెస్ ద్రోహం చేస్తోందన్న కేటీఆర్ కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించారన్నారు. అధికారమదంతో మిడిసిపడుతూ మాట్లాడటం సరికాదన్నకేటీఆర్ పదేపదే కేసీఆర్ చావు కోరుకునే రాబందు రేవంత్ అరి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.