నేడు కూడా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
నేడు కూడా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.
నేడు కూడా హైదరాబాద్ - జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న ఆదివారం అమావాస్య కావడంతో నేడు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగడు ప్రయాణమయ్యారు. ఈరోజు ఉదయం నుంచి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రధానంగా కప్పర్తి వద్ద పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద...
సంక్రాంతి పండగ సమయంలో ఊరు వెళ్లిన వారు కొందరు శనివారమే తిరిగి వచ్చారు. అయితే సెంటిమెంట్ లేని వాళ్లు ఆదివారం కూడా ప్రయాణాలను కొనసాగించారు. అందుకే శనివారం నుంచి హైదరాబాద్ - జాతీయ రహదారిపై ప్రారంభమయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. పోలీసులు అన్ని చోట్ల ఉండి ట్రాఫిక్ నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.