Weather Report : ఉక్కపోత మొదలయిందిగా.. ఇక విద్యుత్తు బిల్లులు అదిరినట్లే

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత ప్రారంభమయింది.

Update: 2026-01-19 04:51 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత ప్రారంభమయింది. అయితే ఇంకా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోకపోయినా ఈ వారం దాటిన తర్వాత 30 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు చేరే అవకాశముందని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ వరకూ చలి తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలను చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. మరొకవైపు ఉదయం వేళ పొగమంచు కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. పొగమంచు తీవ్రత కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.

పొగమంచు తీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోడ్డుపై ప్రయాణం చేసే వారు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలకు గురవుతారని హెచ్చరించారు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ ఉక్కపోత మొదలయింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ముప్ఫయి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం, తెల్లవారు జాము మాత్రమే కొంత చలి గాలులు తగులుతున్నాయి. మిగిలిన అన్ని సమయాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. అదే సమయంలో రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
చలి తగ్గినప్పటికీ...
తెలంగాణలోనూ చలితీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు జనం ఉదయం, రాత్రి వేళ బయటకు వస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకూ పొగమంచు కమ్ముకుంటుంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అదే సమయంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు సూర్యుడు వచ్చినా పొగమంచు మాత్రం తగ్గడం లేదు. అందుకే ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాత్రమే దూర ప్రయాణాలను పెట్టుకోవాలని, అత్యవసరమైతే హెడ్ లైట్లను వేసుకుని వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News