Telangana : తొలి పంచాయతీ ఏకగ్రవం ఎక్కడంటే?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదట పంచాయతీ స్థానం ఏకగ్రీవం అయింది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదట పంచాయతీ స్థానం ఏకగ్రీవం అయింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈరోజు జిల్లాలోని రుద్రంగి మండలంలోని రూపులా తండాలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. సర్పంచ్ గా జవహర్ లాల్ నాయక్ ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జవహర్ లాల్ నాయక్ సర్పంచ్ గా ఎన్నిక కావడానికి అందరూ అంగీకరించారు.
అందరూ కలసి...
తండావాసులందరూ కలసి జవహర్ లాల్ నాయక్ అయితేనే తమ తండా బాగుపడుతుందని భావించి ఆయనను సర్పంచ్ గా ఎన్నుకున్నామని గ్రామస్థులు తెలిపారు. ఎవరూ గ్రామం నుంచ నామినేషన్లు వేయడానికి వీలులేదని తీర్మానం చేశారు. అనంతరం తండా వాసులందరూ కలిసి ఎన్నిక ఏకగ్రీవం అయినందుకు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.