కచ్చా బాదం సింగర్ ఎవరు ? కచ్చా బాదం అంటే ఏంటి ?

కచ్చా బాదం పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అసలు ఈ పాట ఎవరు పాడారు ? సింగర్ ఎవరు? ఈ పాట ఎలా వచ్చింది ?

Update: 2022-02-02 12:52 GMT

సోషల్ మీడియా.. ఎప్పుడు ఎవరిని ఎలా సెలబ్రిటీని చేస్తుందో చెప్పలేం. ఒక్కో సందర్భంలో ఓవర్ నైట్ లో సోషల్ మీడియా సెలబ్రిటీ అయినవారు కూడా ఉన్నారు. ఇప్పుడీ సోషల్ మీడియా సెలబ్రిటీల గొడవేంటి అనుకుంటున్నారా ? ఆ విషయానికే వస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ "కచ్చా బాదం." ఈ పాటకు అసలు అర్థం ఏంటో తెలిసీ, తెలియని వారు కూడా డ్యాన్స్ చేస్తుండటంతో.. తెగ వైరల్ అయిపోయింది.

కచ్చా బాదం పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అసలు ఈ పాట ఎవరు పాడారు ? సింగర్ ఎవరు? ఈ పాట ఎలా వచ్చింది ? అన్న ప్రశ్నలు తలెత్తాయి నెటిజన్ల నుంచి. ఆఖరికి కచ్చా బాదం సింగర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాట పాడిన వ్యక్తి పేరు భూబన్ బద్యాకర్. ఒక్కపాటతోనే ఫేమస్ అయిన భుబన్ బద్యాకర్ తన వ్యాపారం కోసం ఈ పాట పాడుతుండేవాడు. కచ్చా బాదం అంటే.. బెంగాలీలో పచ్చివేరుశెనగ అని అర్థం. భుబన్ బద్యాకర్ తన వేరుశెనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రజలు అతని శైలిని ఇష్టపడ్డారు. అతని పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా భారీగా వైరల్ అయింది.
పశ్చిమ బెంగాల్‌ లోని బీర్భూమ్ జిల్లా దుబ్రాజ్‌పూర్ బ్లాక్ పరిధిలోని కురల్జూరి గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ స్వయంగా 'కచ్చా బాదం' పాటను కంపోజ్ చేశాడు. బెంగాల్ గిరిజన బౌల్ జానపద పాట ఆధారంగా ఈ పాట రూపొందించబడింది. భుబన్ కు భార్య, ఇద్దరు కుమారులతో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. భుబన్ మొబైల్స్ వంటి విరిగిన వస్తువులను కస్టమర్ల నుంచి తీసుకుని, బదులుగా వేరుశెనగ అమ్ముతారు. రోజూ 3-4 కిలోల వేరుశనగ అమ్ముతూ రూ.200-250 వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అతను పాడిన కచ్చా బాదం పాట విపరీతంగా వైరల్ అవ్వడంతో.. వ్యాపారం కూడా వృద్ధి చెందిందని భుబన్ పేర్కొన్నాడు.
Full View






Tags:    

Similar News