ఒక్క రీల్ 190కోట్ల వ్యూస్
దీపికా పదుకోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
దీపికా పదుకోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లకు గ్లోబల్ అంబాసడర్‌గా ఉన్న ఆమె, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పలు ప్రకటనలను కూడా పంచుకుంటూ ఉంటారు. హిల్టన్ కు చెందిన గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్న దీపికా 'ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే' లో నటించిన రీల్‌ను పంచుకున్నారు. ఆగస్టు 4 నాటికి, ఈ రీల్ 1.9 బిలియన్ వ్యూస్ ను అధిగమించి, ఈ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా చూసిన రీల్‌గా నిలిచింది. ఈ కొత్త రికార్డుతో పలువురు అంతర్జాతీయ సెలెబ్రిటీల రీల్స్ కు వచ్చిన వ్యూస్ ను కూడా అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించారు.