ChatGPT హ్యాండ్ ఇవ్వగానే!!

ఎంతో మంది చాట్‌జీపీటీని నమ్ముకుని పనులు చక్కబెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా అది హ్యాండ్ ఇస్తే?

Update: 2025-07-16 09:45 GMT

ChatGPT

ఎంతో మంది చాట్‌జీపీటీని నమ్ముకుని పనులు చక్కబెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా అది హ్యాండ్ ఇస్తే? అలాంటి ఇబ్బందులను పలువురు యూజర్లు ఎదుర్కొన్నారు. చాట్‌జీపీటీ సేవలకు ఊహించని అంతరాయం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యూజర్లు ఈ సర్వీసులను పొందలేకపోయారు. చాట్‌బాట్‌ను ఓపెన్‌ చేస్తుంటే చాట్‌ హిస్టరీ లోడ్‌ అవ్వట్లేదని, ఎర్రర్‌ మెసేజ్‌లు వస్తున్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని యూజర్లకు ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. దాదాపు 82 శాతం మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలను పొందలేకపోతున్నారని డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓపెన్‌ఏఐ సంస్థ తెలిపింది.

Tags:    

Similar News