సైలెంట్ గా సచిన్ కొడుకు అర్జున్ నిశ్చితార్థం
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 25 సంవత్సరాల అర్జున్ ముంబైకు చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సాన్యా చందోక్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రవి ఘాయ్ కుటుంబం ముంబైలోని హాస్పిటాలిటీ రంగంలో ఉంది. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్‌తో పాటూ బ్రూక్లిన్ క్రీమరీ ఐస్‌క్రీమ్ వ్యాపారం, ఇంకా పలు ఇతర బిజినెస్‌లు కూడా ఉన్నాయి.