పానీపూరీలు లాగించేసిన ఏనుగు.. నెట్టింట్లో వీడియో వైరల్

కొన్ని కొన్ని సార్లు ఏనుగుల ప్రవర్తన భయభ్రాంతులకు గురిచేస్తే.. ఇంకొన్ని చార్లు ఆకర్షిస్తుంది. తాజాగా ఓ ఏనుగు పానీపూరీలను

Update: 2022-10-12 06:16 GMT

elephant eats panipoori

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో చిత్రవిచిత్రాలు కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోలు ఇట్టే వైరల్ గా మారుతాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. చిరుత, సింహం, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని భయంకరంగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కొన్ని కొన్ని సార్లు ఏనుగుల ప్రవర్తన భయభ్రాంతులకు గురిచేస్తే.. ఇంకొన్ని చార్లు ఆకర్షిస్తుంది. తాజాగా ఓ ఏనుగు పానీపూరీలను తింటున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. నార్త్ ఇండియా నుంచి పోస్ట్ అయిన ఆ వీడియోలో.. ఓ పానీపూరీ చాట్‌ బండి వద్ద ఒక ఏనుగు నిలబడి ఉంది. నెమ్మదిగా పానీపూరీలను దుకాణదారుడే ఏనుగుకు తినిపించడం మొదలుపెట్టాడు. అది ఎంచక్కా తినేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. మొత్తం దానికే సరిపోయేట్టున్నాయి అని కామెంట్స్ చేశారు.





Tags:    

Similar News