చిన్న సినిమాలపై ఆశలు పెంచుకుంటున్న టాలీవుడ్

Update: 2016-12-01 06:49 GMT

నేడు సినిమా డిజిటలైజ్ అయిపోయాక సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. చిత్ర నిర్మాణం వరకు వీరు ప్రణాళిక ప్రకారమే వెళ్తున్నా ప్రచారాలు, విడుదలలు వీరిని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. అయితే మద్రాస్ పట్టణంలో మన చిత్ర పరిశ్రమ వున్ననాటినుంచి నిర్మాణ రంగంలో వున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇటీవలి కాలంలో సొంతగా చిత్ర నిర్మాణాలు చేపట్టటంలేదు. దగ్గుబాటి సురేష్ బాబు ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో సంయుక్తంగా నిర్మించటం కానీ, చిన్న వ్యయంతో నిర్మితమైన పరిచయ నటుల చిత్రాలు కొత్త తరహాలో ఉంటే వాటిని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ప్రొడక్షన్ హౌస్ పేరుతో ప్రచారం చేసి విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో పెళ్లి చూపులు అందుకున్న భారీ విజయం వెనుక సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రచారా వ్యూహాల పాత్ర ఎంతో వుంది.

అష్ట చెమ్మతో నాని ని వెండి తెరకు పరిచయం చేసినా, ఉయ్యాలా జంపాల చిత్రంతో రాజ్ తరుణ్, అవికా గౌర్ లను వెండి తెరకు పరిచయం చేసినా అవి స్టార్స్ నటించిన సినిమాల స్థాయిలో విజయం పొందాయి అంటే ఆ చిత్ర నిర్మాత రామ్ మోహన్ కృషే ప్రధమంగా కనపడుతుంది. ఇప్పుడు యూట్యూబేలో హల్చల్ చేస్తున్న పిట్టా గోడ ప్రచార చిత్రానికి భారీ స్పందన రావటానికి కానీ, కొత్త హీరో పరిచయమవుతున్న ఈ చిత్రానికి భారీ అంచనాలు పెరుగుతున్నాయి అంటే కారణం నిర్మాత రామ్ మోహనే. విశ్వదేవ్ రాచకొండ ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన నిర్మిస్తున్న పిట్ట గోడ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించటంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

స్టార్ హీరోస్ కాల్ షీట్స్ సంపాదించటం సురేష్ ప్రొడక్షన్స్ కి కష్టమైన పని కాకపోయినా, సురేష్ బాబు స్టార్స్ వెంట తిరగక నూతన శైలిలో కథ చెప్పే దర్శకుల, చిన్న బడ్జెట్ నిర్మాతల చిత్రాలను ప్రోత్సహిస్తుండటం యువ దర్శకులకు ఆశించదగ్గ పరిణామం. పెళ్లి చూపులు తరువాత చిన్న బడ్జెట్ చిత్రంగా సురేష్ బాబు విడుదల చేస్తున్న పిట్ట గోడ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో మరి..

Similar News