నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి

Update: 2026-03-23 03:19 GMT

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి. మలి విడత పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చజరుగుతుంది. అలాగే ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది.

కీలక బిల్లులు ఆమోదానికి...
అయితే ఈ శ్రీరామ నవమి సందర్భంగా 26వ తేదీన పార్లమెంటుకు సెలవు దినం. సాయుధ పోలీసుల బలగాల సాధారణ పరిపాలన బిల్లులు నేడు రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. ఇక విపక్షాలు కూడా తమ వాయిదా తీర్మానాల ద్వారా యుద్ధం ప్రభావంతో పెరిగినధరలు, గ్యాస్ సంక్షోభంపై చర్చజరగాలని పట్టుబట్టనుంది. మొత్తం మీద నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.


Tags:    

Similar News