Breaking : పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్
ఇరాన్ పై యుద్ధాన్ని కొన్ని రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు
ఇరాన్ పై యుద్ధాన్ని కొన్ని రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.దీంతో ఇరాన్ పై యుద్ధానికి బ్రేక్ పడిందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పై యుద్ధాన్ని ట్రంప్ ప్రకటించారు. గత ఇరవై ఐదు రోజుల నుంచి ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఐదు రోజుల పాటు ముగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పై తాత్కాలికంగా దాడులను ఆపేస్తున్నామని తెలిపారు.
చర్చలు సానుకూలంగా సాగాయని...
రెండు రోజులు ఇరాన్ తో చర్చలు సానుకూలంగా సాగాయన్న ట్రంప్ వారం రోజలు పాటు చర్చలు సాగుతాయని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అనేక రకాలుగా దాడులు జరుగుతుండటంతో పాటు హర్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ చమురు నిల్వలు మూసివేయడంతో అనేక దేశాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. దీంతో ట్రంప్ యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.