భారీ ఊరట : గోల్డ్ కొనేయండి ఇక

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా నిలకడగానే కొనసాగుతుంది.

Update: 2023-03-13 03:13 GMT

బంగారం ధరలు తగ్గితే ఆనందపడే పసిడిప్రియులు.. స్థిరంగా ఉన్నా అదే ఆనందంతో ఊగిపోతారు. స్థిరంగా ధరలు కొనసాగినప్పుడు కూడా ఆనంద పడతారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అనేక కారణాలతో బంగారం ధరలు ఈఏడాది మరింత పెరుగుతాయని కూడా అంచనా వేశారు. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్వల్పంగానైనా తగ్గుతుండటం శుభపరిణామంగానే చూడాలి. అందరికీ బంగారం ధర అందుబాటులో ఉంటేనే కొనుగోళ్లు కూడా ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు సయితం అభిప్రాయపడుతున్నారు.

వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా నిలకడగానే కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,160 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,890 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 68,700 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News