ఓల్డ్ బిల్డింగ్ : ఫొటో సెషన్
పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలికారు. ఈరోజు నుంచి కొత్త పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలికారు. ఈరోజు నుంచి కొత్త పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాత పార్లమెంటు భవనంలో ఎంపీలు ఫొటోలు దిగుతూ తమ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన పాత భవనం నుంచి నేడు కొత్త భవనానికి వెళుతుండటం కొంత బాధ కలిగిస్తున్నా పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో తప్పులేదని చెబుతున్నారు. పాత పార్లమెంటు భవనాన్ని అలానే ఉంచి ప్రజా సందర్శన కోసం అనుమతిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న పార్టమెంటు సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
నేటి నుంచి...
ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి పాత భవనంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటిని పదిలపర్చుకునేందుకు పార్లమెంటు సభ్యులు ఫొటోలు దిగుతున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ కలసి గ్రూప్ ఫొటో దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ సభ్యులతో విడిగా సమావేశమయ్యారు. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ లు ఎంపీలతో కలసి ఫొటో దిగారు. అనంతరం అందరూ కలసి పాత పార్లమెంటు హాలుకు వీడ్కోలు పలుకుతూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంటులో కార్యకలాపాలు మొదలు కానున్నాయి.