స్పైడర్ మూవీ ఫస్ట్ టాక్ వచ్చేసింది. మహేష్ ఫ్యాన్స్ కు ఇక పండగే. స్పైడర్ మూవీ దసరా హిట్ కొట్టేసిందని ఫస్ట్ రివ్యూ చెబుతోంది. మహేష్ బాబు మురుగుదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ మూవీ అభిమానులకు అంచనాలను మించి ఉందన్న టాక్ వచ్చేసింది. సెకండ్ ఆఫ్ లో కొనసాగిన సస్పెన్స్ సినిమాకు మంచి ఎస్సెట్ అని అంటున్నారు. ఎక్కడా సినిమాను లాగ్ చేయకుండా దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారని విశ్లేషకులు చెబుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో స్పైడర్ మూవీ ఉందని ఫస్ట్ టాక్ వచ్చింది. రా ఏజెంట్ గా మహేష్ బాబు నటనను అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. సో... దసరాకు మహేష్ బాబు స్పైడర్ మూవీతో సూపర్ హిట్ కొట్టేశారన్న మాట.