లారెన్స్ ఎంట్రీతో చిరుకు ఆప్షన్ లేకుండాపోయింది!

Update: 2016-10-14 04:53 GMT

మెగాస్టార్ చిరంజీవి చిత్రం నుంచి కేథరిన్ తెరెసాను తప్పించారు సరే. మరి లక్ష్మీరాయ్‌ను ఎంచుకోవడం వెనుక మర్మం ఏమిటి? సాధారణంగా తన చిత్రం విషయంలో మెగాస్టార్ చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా తానే ఎంచుకుంటారు. ఆయన పర్సనల్ గా ఎంచుకోకుండా ఏదీ జరగదు. అలాంటిది చిరంజీవికి ఆప్షన్ అంటూ లేని పరిస్థితుల్లో ఆయనను గత్యంతరంలేని పరిస్థితుల్లో పెట్టి లారెన్స్ లక్ష్మీరాయ్ ను తీసుకువచ్చాడా? సినిమా ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.

మెగస్టార్ తన 150వ చిత్రానికి చాలా రకాల వడపోత తర్వాత.. ప్రకటించిన దర్శకుడిని కూడా మార్చేసి మరీ.. ప్రాజెక్టును వినాయక్ చేతుల్లో పెట్టారు. అలాగే ప్రతి విషయంలోనూ అంతే శ్రద్ధగా తనే సెలక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలోనే సరైనోడు లో యంగ్ ఎమ్మెల్యేగా మెప్పించిన కేథరిన్‌కు ఐటం సాంగ్‌లో చిందేసే ఛాన్స్ దక్కింది. తీరా ఐటం సాంగ్ చిత్రీకరణ సమయానికి సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్ లారెన్స్.. కేథరిన్ మీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా గుసగుసలు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. తాను చెప్పినట్టుగా వినడం లేదని, చెప్పిన డ్రస్ వేసుకోలేదని, చెప్పినట్లుగా డ్యాన్స్ చేయడం లేదని లారెన్స్ రకరకాల ఫిర్యాదుల్ని మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లి మొత్తానికి కేథరిన్ కు ఎగ్జిట్ డోర్ చూపించారు. అయితే ఆ స్లాట్ లోకి లక్ష్మీరాయ్ రావడమే చాలా చిత్రంగా చాలా మంది భావిస్తున్నారు.

కేథరిన్‌కు లక్ష్మీరాయ్ ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది.. ఇద్దరి అపియరెన్స్ వేర్వేరు కదా అని అంటున్నారు. అయితే ఆమెను ప్రాజెక్టులోకి తీసుకురావడంలో లారెన్స్ పాత్రే ఎక్కువగా ఉన్నదిట. సాంగ్ షూటింగ్ కూడా మొదలైన తర్వాత.. అప్పటికప్పుడు కేథరిన్ ను బయటకు పంపేశాక, ఎక్కువ ఆప్షన్స్ ను పరిశీలించే ఛాన్స్ చిరంజీవికి లేకుండా పోయిందని.. లారెన్స్ చెప్పిన దానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. చిరంజీవికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా లారెన్స్ గేమ్ ప్లే చేసి ఉండచ్చుననేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నటాక్.

Similar News