తెలుగు చిత్రాల స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ఘనత బాహుబలి చిత్రానికి దక్కింది. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల తర్వాత ఇతర తెలుగు చిత్రాల విదేశీ వసూళ్లు కూడా అధికంగా పెరిగిపోయాయి. ఇప్పుడు బాహుబలి 2 చిత్రీకరణలో చిత్ర బృందం అంత తలమునకలై ఉంది. మొదటి భాగం విడుదల విషయంలో జరిగిన వాయిదాలు ఈ సారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు దర్శకులు రాజమౌళి. బాహుబలి 2 2017 మే నెల లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది అని ఇప్పటికే ప్రకటించారు.
బాహుబలి ఎంత సంచలన విజయాన్ని సాధించిన, అప్పటికి ఉన్న అన్ని ఆదికి వసూళ్ల చరిత్రను తిరగ రాసినా ఆ చిత్రం పై ఉన్న ఊహకందని అంచనాల వల్ల మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో ప్రారంభం ఐయ్యింది. బాహుబలి 2 కి ఆ పరిస్థితి రాకూడదు అని, ప్రేక్షకులు పెట్టుకునే భారీ అంచనాలను విడుదల ఆట నుంచే అందుకోవాలని తాపత్రయ పడుతున్న రాజమౌళి విపరీతంగా కష్ట పడుతున్నాడంట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వ్యాపారం ముగిసిపోయింది అని వార్తలు వినపడుతున్నాయి. నైజాం అయితే భారీ మొత్తానికి అమ్మినట్టు సమాచారం. ఒక్క నైజాం విడుదల హక్కులనే 45 కోట్ల రూపాయలకు విక్రయించారని వినికిడి.
బాహుబలి మొదటి భాగాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాం ప్రాంతంలో విడుదల హక్కులను 25 కోట్ల రూపాయలు చెల్లించి పొందగా, ఆ చిత్రం 43 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.