బాలయ్య హీరోయినే మెగాస్టార్ సరసన ఐటం బాంబ్

Update: 2016-10-13 11:53 GMT

కేవలం తమ ఒక్క చరిష్మా మీదనే సినిమా మొత్తం ఆడేస్తుందని ఎంత గొప్ప స్టార్ లైనా ధీమాగా అనునకునే రోజులు మారిపోయాయి. అందుకే కాంబినేషన్లకు , చివరికి ఐటంగాళ్స్ కు కూడా ప్రయారిటీ పెరిగిపోతున్నది. ఏ చిత్రంలో ఐటం సాంగ్ ఎవరు చేస్తున్నారు? అనే ఎలిమెంట్ కు.. సినిమా మార్కెట్ పరంగా వేల్యూ ఉంటోంది. ఇలాంటి నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేస్తున్న 150 వ చిత్రంలో ఐటం బాంబ్‌ను మార్చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా చేసిన లక్ష్మీరాయ్ ను ఇందులో ఐటంగాళ్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి తొలుత కేథరిన్ ట్రెసా ను అనుకున్నారు. సరైనోడు చిత్రలో యంగ్ ఎమ్మెల్యేగా చేసిన కేథరిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగా చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి కేథరిన్ ఎగిరి గంతేసి ఒప్పుకుంది. తీరా ఐటం సాంగ్ షూటింగ్ మొదలయ్యే సమయానికి.. షూట్‌కు లక్ష్మీరాయ్ హాజరైనట్లు తెలుస్తోంది. కేథరిన్ ను ఎందుకు తప్పించారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.

9 ఏళ్ల గ్యాప్ తర్వాత వెండితెర మీద మళ్లీ మెరవడానికి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150 చిత్రం ఇది. వివి వినాయక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

Similar News