పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నాగార్జున సోదరి సుశీల

Update: 2017-11-18 11:49 GMT

చింతలపూడి శ్రీనివాసరావు వ్యాపారంలో తనను మోసం చేశాడని, తనకు తెలీకుండా ఆస్తులు అమ్మేశాడని నాగసుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేయవలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. గత కొన్ని సంవత్సరాలుగా చింతలపూడి శ్రీనివాసరావు భాగస్వామ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించామని, అయితే తనకు తెలీకుండా భూములను అతను అమ్ముకుని మోసం చేశాడని సుశీల ఫిర్యాదు చేసింది. శ్రీనాగ్ ఎస్టేట్స్, శ్రీనాగ్ కార్పొరేషన్, ఎస్ ఆర్ ప్రాపర్టీస్ సంస్థలలో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు చింతలపూడి శ్రీనివాస రావు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారు.

సుశాంత్ తో సినిమాలు తీయడం వల్లనే...

భూములకు సంబంధించిన లెక్కలు చెప్పమంటే అతను ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడే తప్ప, నిజాలు చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. చింతలపూడి శ్రీనివాస రావు వైజాగ్ లో తన పేరుతో ఉన్న12 ఎకరాల భూములను విక్రయించారని నాగసుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది.అయితే ఈ ఆరోపణలను చింతలపూడి శ్రీనివాస రావు ఖండించారు. తాము చట్ట ప్రకారమే వ్యాపారం చేశామని, నాగ సుశీల కుమారుడు సుశాంత్ తో 4 సినిమాలు నిర్మించామని, వాటికి సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయని, తానెవరిని మోసం చేయలేదని అతను స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News