ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ -''ఖైదీ నంబర్ 150 .. మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సోమవారం నుంచి పతాక సన్నివేశాల చిత్రీకరిస్తాం. సైమల్టేనియస్‌గా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తున్నాం. త్వరలోనే పాటల చిత్రీకరణకు యూనిట్ విదేశాలు వెళుతోంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. దీపావళి కానుకగా అభిమానుల ముందుకు కొత్త పోస్టర్లను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోటతరణి కళాదర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు.