టాలీవుడ్‌కు మూలస్తంభాల్లాంటి ఫ్యామిలీల్లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులు కూడా వెండితెర మీద ఎంట్రీ ఇచ్చారు. ఈ యేడాది ఈ ఫ్యామిలీ హీరోల్లో కింగ్ నాగార్జునతో పాటు ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ అయ్యాయి. హలో ఇంకా థియేటర్లలో రన్ అవుతున్నా సినిమాకు వచ్చిన టాక్ బాగున్నా వసూళ్ల పరంగా చూస్తే హలో బాక్సాఫీస్ దగ్గర నీరసపడుతూ కమర్షియల్ ప్లాప్‌గా నడుస్తోంది.
ఈ యేడాది ఫిబ్రవరి 9న నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ రిలీజ్ అయ్యింది. నాగార్జున భక్తిరస చిత్రాల హీరో కావడం, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.35 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. రూ.12 కోట్లతో చాప చుట్టేసింది. బుల్లితెర మీద కూడా ఈ సినిమాకు ఘోరమైన రేటింగులు వచ్చాయి. నాగ్ - రాఘవేంద్రుడికి ఈ సినిమా ఓ పీడకలగా మిగిలిపోయింది.
ఇక నాగచైతన్యకు ఓ హిట్, ఓ డిజాస్టర్ వచ్చాయి. చైతన్య, రకుల్ జంటగా కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం హిట్ అయ్యింది. సెప్టెంబర్ 8న నాగచైతన్య నటించిన యుద్ధం శరణం రిలీజ్ అయ్యింది. సాయి కొర్రపాటి బ్యానర్, లావణ్య త్రిపాఠి హీరోయిన్ కావడంతో సినిమాకు రిలీజ్‌కు ముందు మంచి హైపే ఉంది. తీరా రిలీజ్ అయ్యాక తొలి ఆటకే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా చైతు గతేడాది చేసిన సాహసం శ్వాసగా సాగిపో సినిమానే మరోసారి మరో యాంగిల్లో తీసినట్లుందన్న విమర్శలు మూటకట్టుకుంది. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో పెరిగిన చైతు మార్కెట్‌ను ఈ సినిమా మరో సారి ప్రశ్నార్థకంగా మార్చేసింది.
ఇక నాగ్ తన కోడలు సమంతతో కలిసి చేసిన రాజు గారి గది 2 కూడా టాక్ ఓకే అనిపించుకున్నా వసూళ్ల పరంగా తేలిపోవడంతో సక్సెస్ కాలేకపోయింది. స్వల్ప నష్టాలతో ఈ సినిమా భయటపడింది. ఇక యేడాది చివర్లో వచ్చిన అఖిల్ రెండో సినిమా హలో టాక్ పర్లేదనిపించుకున్నా వసూళ్ల పరంగా తేలిపోయింది. రూ.32 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 50 శాతం నష్టాల దిశగా వెళుతోంది. అఖిల్‌తో ఘోరమైన డిజాస్టర్ ఇచ్చిన అఖిల్, హలోతో కూడా సేమ్ రిజల్ట్ ఇచ్చేలాగా ఉన్నాడు.
ఈ యేడాది వ్యక్తిగతంగా కూడా నాగ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. చిన్న కుమారుడు అఖిల్ - శ్రియా భూపాల్ ఎంగేజ్‌మెంట్ ఎంతో ఆర్భాటంగా జరిగాక పెళ్లికి రెడీ అవుతోన్న టైంలో ఈ జంట మధ్య విబేధాలు రావడంతో ఇది క్యాన్సిల్ అవ్వడం బాధాకరం. ఈ వార్తలపై నాగ్ ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు. ఇక చైతు - సమంత పెళ్లి అక్కినేని ఫ్యామిలీలో ఈ యేడాది జోష్ నింపిన అంశం. ఏదేమైనా సినిమాల పరంగాను, అటు వ్యక్తిగతంగాను అక్కినేని ఫ్యామిలీకి ఈ యేడాది కలిసి రాలేదు.