ఒకప్పటిలా నట జీవితం ముగించేవరకు కథానాయకులు హీరోలాగానే కొనసాగాలనే నియమాలు ఏమి పెట్టుకోవటం లేదు. దీనికి నిదర్శనమే తన్ని ఊరువం లో అరవింద్ స్వామి, సరైనోడు లో ఆది పినిశెట్టి, బాహుబలి లో రానా దగ్గుబాటి, రోబో 2 లో అక్షయ్ కుమార్ లాంటి కథానాయకులు ప్రతినాయకుల పాత్రలు పోషించి మెప్పించటమే. ఈ జాబితాలోకి ఇటీవల సూపర్ స్టార్ క్రిష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు కూడా చేరారు. భాగీ అనే హిందీ చిత్రంలో ఆయన ప్రతి నాయకుడి పాత్రను పోషించి ప్రశంసలు పొందాడు.
బాలీవుడ్ లో రెప్యుటేడ్ హీరో ఐన వివేక్ ఒబెరాయ్ మాత్రం ప్రతినాయకుడి పాత్రను పోషించటానికి ముందుగా ఆస్కతి చూపక ఒక భారీ చిత్ర అవకాశం వదులుకున్నాడు. అదే మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెం.150. దానికి తీవ్రంగా బాధపడ్డాడో ఏమో, ఇప్పుడు ప్రతినాయకుని పాత్ర కోసం తమిళ నటుడు అజిత్ సినిమాకి అడగగా వెంటనే అంగీకరించాడు వివేక్. ఆ చిత్రమే తల 57. ఇది అజిత్ కి 57 వ చిత్రం. వివేక్ ఒబెరాయ్ నటించటం వలన తల 57 ఉత్తరాదిన కూడా అధిక థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాం వుంది.
వివేక్ ఒబెరాయ్ వదులుకున్న ఖైదీ నెం.150 చిత్రంలోని పాత్ర ని అంజలా జవేరి భర్త తరుణ్ అరోరాతో నటింపచేస్తున్నారు నిర్మాత రామ్ చరణ్ తేజ్.