[embed]https://www.youtube.com/watch?v=ouXn5CK0wTU[/embed]
‘‘సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..’’ డైలాగ్ ఎంత పవర్ ఫుల్‌గా ఉన్నదో అనిపిస్తోంది కదా.. అదే డైలాగును నందమూరి బాలకృష్ణ పలికింతే ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉంటుందో ఆలోచిచండి. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న బాలయ్య 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్ అంతే పవర్‌ఫుల్ గా అభిమానుల్ని అలరిస్తోంది.
విజయదశమి పర్వదినం నాడు.. చిత్రం టీజర్ ను ఈ చిత్రంలో ఓ కీలకభూమిక కూడా పోషించిన బాలీవుడ్ ప్రఖ్యాత నటి హేమమాలిని ఆవిష్కరించారు.
‘‘నా కత్తికి అంటిన నెత్తుటి చారిక ఇంకా పచ్చిగానే ఉంది’’ అంటూ బాలయ్య వీరోచిత యుద్ధ ప్రియత్వాన్ని.. తెలియజెప్పే దృశ్యాలు ఈ టీజర్ లో ఉన్నాయి. మొత్తానికి గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం టీజర్ కోసం చాలా కాలం నుంచి నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ ఎంతో శ్రద్ధగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ టీజర్‌లో బాలయ్యను చూపించిన తీరు.. దర్శకుడి శ్రద్ధను తెలియజెప్పేలాగానే ఉన్నదని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విజయదశమి కి తమ బాలయ్య మంచి కానుకే ఇచ్చాడని అనుకుంటున్నారు.