అలాంటివన్నీ మనకెందుకు అంటున్న ముద్దుగుమ్మ

Update: 2016-10-25 01:10 GMT

ఇలా అన్నది ఎవరో కాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. డైరెక్టుగా నాకు అవార్డ్స్ అక్కర్లేదు అనలేదు గాని అదే మీనింగ్ వచ్చేలాగా కాజల్ మాట్లాడుతోంది. ఇప్పుడు కాజాల అగర్వాల్ చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లోను.... ఇంకా తనని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ సినిమాలో నటిస్తుంది. ఇప్పటివరకు పక్కాగా కమర్షియల్ చిత్రాలే చేసుకుంటూ పోతుంది కాజల్. ఇక తన కెరీర్లో ఇలాంటి కమర్షియల్ సినిమాలే చేస్తాను అని అంటుంది. అసలు ప్రయోగాత్మక చిత్రాల జోలికి, లేడి ఓరియెంటెడ్ చిత్రాలజోలికి వెళ్లనని డైరెక్ట్ గా చెబుతుంది. తనకి అలాంటి చిత్రాలంటే భయమని చెబుతోంది. అయితే క్రిటిక్స్ మాత్రం భయము పాడు లేదు కాజల్ చాలా తెలివిగా మాట్లాడుతోందని చెబుతున్నారు.

ఇలా ప్రయోగాలు గట్రా చేస్తే అవి కేవలం అవార్డులు తెచ్చి పెడతాయి గాని రెమ్యునరేషన్ పెద్దగా ఉండదని... అందుకే కాజల్ కేవలం కమర్షియల్ చిత్రాలని నమ్ముకుంటుందని అంటున్నారు.

హీరోయిన్ గా శాచురేషన్ పాయింట్ చేరుకోవడం కాదు గానీ.. తమ హవా బాగా నడుస్తున్న సమయంలో చాలా మంది హీరోయిన్లు.... లేడీ ఓరియెంటెడ్ అనే ముసుగులో.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ ఉంటారు. చాలా మంది ఈ విషయంలో దెబ్బతింటూ ఉంటారు కూడా. ఆ చిత్రాల ఎంపిక వల్ల వారిమీద అలాంటి బ్రాండ్ పడిపోతూ ఉంటుంది. అయితే కాజల్ మాత్రం చాలా తెలివిడి ప్రదర్శిస్తూ అలాంటి చిత్రాలన్నీ మనకెందుకు అంటున్నదంటే.. చిత్రమే.

Similar News