వరుసగా 3 సినిమాల హిట్స్ తో ఎన్టీఆర్ పిచ్చ జోరుగా వున్నాడు. ఇక తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రోజుకో పేరు వార్తల్లోకొస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. మీడియా అయితే రోజుకో డైరెక్టర్ పేరుని ఎన్టీఆర్ తో చేర్చి ప్రచారం చేస్తుంది. అసలు ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమా పూర్తయిన తర్వాత అయన ఫ్రెండ్, రైటర్ అయిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమా చెయ్యాల్సి వుంది. కానీ వక్కంత మొదటిసారి డైరెక్షన్ చెయ్యడం వలన ఎన్టీఆర్ కి పూర్తి నమ్మకం రాకపోవడం తో అతని సినిమాని క్యాన్సిల్ చేసాడు. ఇక తర్వాత రోజుకో న్యూస్ మీడియా లో షికార్లు చేశాయి. ఒకసారి పూరితో ఎన్టీఆర్ సినిమా ఫైనల్ అయ్యిందని మరోసారి బోయపాటితో స్టోరీ డిస్కర్షన్ లో ఎన్టీఆర్ వున్నాడని అంటున్నారు. ఇక నిన్నటికి నిన్న భారీ ప్లాప్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు అన్నారు.
అయితే ఇప్పటికే బోయపాటి ఎన్టీఆర్ తో 'దమ్ము' వంటి ప్లాప్ ఇచ్చాడు గనక ఈసారి చేసే ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ కి అందించాలని బోయపాటి కంకణం కట్టుకున్నాడనీ అంటున్నారు. ఎన్టీఆర్ స్టామినాకి తగ్గ స్టోరీ ని తయారు చేసుకుని బోయపాటి ఎదురుచూస్తున్నాడట. అయితే ఇంకా ఎన్టీఆర్ ని అయన కలవలేదని తొందరలోనే కలుస్తాడని చెబుతున్నారు. అయితే బోయపాటి ఒక పక్క బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తానని కమిట్ అవ్వడం వల్ల లాక్ అయ్యాడని అందుకే ఎన్టీఆర్ ని కలవడం ఆలశ్యం అవుతుందని అంటున్నారు.. ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్న బోయపాటి ఆ చిత్రాన్ని తెరకెక్కించకుండా బెల్లంకొండని తప్పించుకుని తిరుగుతున్నాడని అంటున్నారు. మరి ఇప్పుడు గనక ఎన్టీఆర్ ని కలిసి తన స్టోరీ చెబితే అది గనక ఎన్టీఆర్ కి నచ్చితే ఈ సినిమాని వెంటనే తెరకెక్కించాలని బోయపాటి అనుకుంటున్నాడట. మరి ఇటు శ్రీనివాసుని ఏం చేస్తాడో బోయపాటి ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చిన వారు ఊరికే ఊరుకోరు గదా.