ఏడుపాయల వనదుర్గ ఆలయంలో శరన్నవరాత్రులు

ఏడుపాయల వనదుర్గ ఆలయం ఇంకా వరద ముంపులోనే ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను రాజగోపురం పై అర్చకులు జరుపుతున్నారు.

Update: 2025-09-22 04:09 GMT

ఏడుపాయల వనదుర్గ ఆలయం ఇంకా వరద ముంపులోనే ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను రాజగోపురం పై అర్చకులు జరుపుతున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయం గత కొద్ది రోజుల నుంచి వరద నీటిలో మునిగి ఉంది. దీతో గత కొంతకాలంగా రాజగోపరానికి మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. అయితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో ప్రారంభమయ్యాయి.

వరద ముంచెత్తుతున్నా...
వరద ముంచెత్తుతున్నప్పటికీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజులుగా వరదలతో ఆలయం మూతపడింది. నవదుర్గ భవానీ ఆలయం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో తెరిచారు. అయితే మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పాటు సింగూరు నుంచి విడుదల చేయడంతో వనదుర్గ ఆలయంలోని అమ్మవారి పాదాలను తాకుతూ నదీ జలాలు వెళుతున్నాయి. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చే్తున్నారు.


Tags:    

Similar News