అగ్నిప్రమాదంలో మహిళ సజీవదహనం

అర్థరాత్రి కావడంతో ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి నర్సింహులు భార్య..

Update: 2022-03-15 09:49 GMT

మెదక్ : అర్థరాత్రి మెదక్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తిమ్మానగర్ లో నర్సింహులు కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ తో పూరిగుడిసెకు మంటలు అంటుకున్నాయి. దాంతో ఇంట్లో గాఢనిద్రలో ఉన్న దంపతులు, కొడుకుకి మంటలంటున్నారు. అర్థరాత్రి కావడంతో ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి నర్సింహులు భార్య మంగమ్మ (35) సజీవ దహనమైంది.

నర్సింహులు, కొడుకు రవికి తీవ్రగాయాలవ్వగా వారిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో కరెంట్ ట్రిప్పు కావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.


Tags:    

Similar News