Telangana : జల దిగ్బందంలో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం
ఇప్పటికీ జల దిగ్బందంలో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ఉంది
ఇప్పటికీ జల దిగ్బందంలో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం వద్ద ఉదృతంగా మంజీరా నది ప్రవహిస్తుండటంతో భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత కొంత కాలంగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్భంధనంలోనే ఉంది. ఈ ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
భారీ వర్షాలకు...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న మంజీరకు భారీగా వరద నీరు చేరుతుండటంతో ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రధాన ఆలయం మూసివేసిన అర్చకు పైన ఉన్న రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.