ఏడుపాయల ఆలయాన్ని పదోరోజు మూసివేత
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని పదో రోజు కూడా మూసివేశారు
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని పదో రోజు కూడా మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం వద్ద భారీగా నీరు ప్రవహిస్తుంది. దీంతో భక్తులు ప్రమాదంలో పడతారని భావించి ఆలయాన్ని మూసివేశారు. మంజీరా నది ప్రవాహంతో ఏడుపాయల ఆలయాన్ని గత పది రోజుల నుంచి మూసివేశారు.
మంజీరా నది....
ఆలయం ప్రాంగణంలోకి నీరు ప్రవేశించినందున పూజారులు రాజగోపురంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలోకి భక్తులు ప్రవేశించుకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గర్భగుడివైపు ఎవరూ వెళ్లకుండా అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. నీటి ప్రవాహం తగ్గేంత వరకూ భక్తులను అనుమతించేది లేదని చెప్పారు.