Hyderabad : హైదరాబాల్ లో భారీగా కుళ్లిన మాంసం సీజ్
హైదరాబాద్ లో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు
హైదరాబాద్ లో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. మంగళహాట్ లో కిలోల కొద్దీ మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ లోని పలు హోటళ్లకు కుళ్లిన మాంసాన్ని అఫ్రోజ్ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి చెడిపోయిన మాంసాన్ని ఇక్కడకు తీసుకు వచ్చి హోటళ్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.
ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చి...
పథ్నాలుగు టన్నుల కుళ్లిపోయిన మాంసాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, మహారాష్ట్రల నుంచి ఈ మాంసాన్ని తీసుకు వచ్చినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల ఎదుట అఫ్రోజ్ అంగీకరించాడు. హోటళ్లకు తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రయోజనం పొందుతున్నాడని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.