Chandrababu : నేడు హైదరాబాద్ లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్‌ విడుదలయింది

Update: 2026-04-02 04:11 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్‌ విడుదలయింది. ఉదయం 8:30కు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌లో టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు...
మధ్యాహ్నం 12:30కు ఉండవల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 7:30కు కుంచనపల్లిలో మరో వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. నిన్న ఒంటిమిట్ట కు వెళ్లిన చంద్రబాబు అక్కడే రాత్రి బస చేసి ఈరోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు.


Tags:    

Similar News