Hyderbad : విమానానికి బాంబు బెదిరింపు

గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు

Update: 2026-02-12 06:24 GMT

గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఈ విమానాన్ని అధికారులు సోదాలు నిర్వహించారు. బెహరైన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన గల్ఫ్‌ ఎయిర్‌లైన్స్‌ 274 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో కలకలం రేగింది.

లేదని తెలియడంతో...
అప్రమత్తమైన అధికారులు పైలెట్‌కు సమాచారం అందించగా, విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. అనంతరం ప్రయాణికులను ఐసోలేషన్‌ ప్రాంతానికి తరలించారు. బాంబ్‌ స్క్వాడ్‌, భద్రతా బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం మామూలు అయిపోయింది


Tags:    

Similar News