Hyderabad : హైదరాబాద్ లో రెండు చిరుత పులుల సంచారం

హైదరాబాద్ లో రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపాయి. బాలాపూర్ లోని ఆర్.సి.ఐ కార్యాలయంలో రెండు చిరుతలు కనిపించాయి

Update: 2025-07-12 03:56 GMT

హైదరాబాద్ లో రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపాయి. బాలాపూర్ లోని ఆర్.సి.ఐ కార్యాలయంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి. సిబ్బంది, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప రాత్రి పూట ఒంటరిగా బయటకు రావద్దని సూచించింది.

చిరుతలు కనిపిస్తే
ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపింది. అటవీ శాఖ అధికారులు రెండు చిరుతలను పట్టుకునేందుకు అక్కడ ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేశారు. స్థానికులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రం అటవీ శాఖ అధికారులు బాలాపూర్ ఆర్.సి.ఐ కార్యాలయం సమీపంలోని ప్రజలకు సూచించారు.


Tags:    

Similar News